నీ చల్లనైన నీడలో

Nee Challanaina Needalo

Lyricistఆడమ్ బెన్నీ
UncategorizedAdded on 1/3/2016

Lyrics

నీ చల్లనైన నీడలో నన్ను నివసించనీ ప్రభు
నీ పరిశుద్ధ పాదములే నన్ను తాకనీ ప్రభు
నీ ప్రేమా నా లోనా
ప్రతిక్షణం అనుభవించనీ
(2)          ||నీ చల్లనైన||
మట్టి వంటిది నా జీవితం
గాలి పొట్టు వంటిది నా ఆయుషు
పదిలముగా నను పట్టుకొని
మార్చుకుంటివా నీ పోలికలో
మరణ భయమిక లేదంటివి
(2)          ||నీ చల్లనైన||
మారా వంటిది నా జీవితం
ఎంతో మదురమైనది నీ వాక్యం
హృదయములో నీ ప్రేమా
కుమ్మరించుమా జుంటి తేనెలా
(ఆహా) మధురం మధురం నా జీవితం
(2)          ||నీ చల్లనైన||
అల్పమైనది నా జీవితం
ఎంతో ఘనమైది నీ పిలుపు
నీ సేవలో నే సాగుటకు
నను నింపుమా నీ ఆత్మ శక్తి తో
నే ఆగక సాగెద నీ సేవలో
(2)          ||నీ చల్లనైన||

Video