నీ చరణములే నమ్మితి
Nee Charanamulae Nammithi
Lyricistపురుషోత్తము చౌధరి
UncategorizedAdded on 9/18/2017
Lyrics
నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి (2) ||నీ చరణములే|| దిక్కిక నీవే చక్కగ రావే మిక్కిలి మ్రొక్కుదు మ్రొక్కుదు మ్రొక్కుదు ||నీ చరణములే|| ఐహిక సుఖము – నరసితి నిత్యము ఆహాహా ద్రోహిని ద్రోహిని ద్రోహిని ||నీ చరణములే|| న్యాయము గాని – నా క్రియలన్ని రోయుచు ద్రోయకు త్రోయకు త్రోయకు ||నీ చరణములే|| భావము మార్చి – నావెత దీర్చి దేవర ప్రోవవే ప్రోవవే ప్రోవవే ||నీ చరణములే|| చంచల బుద్ధి – వంచన యెద్ది ఉంచక త్రుంచవే త్రుంచవే త్రుంచవే ||నీ చరణములే|| చుర్రుకొని యున్న – శోధనలున్న పట్టు విడ గొట్టవే కొట్టవే కొట్టవే ||నీ చరణములే|| నాచు పిశాచి – నరుకుట గాచి కాచుకో దాచవే దాచవే దాచవే ||నీ చరణములే|| యేసుని తోడ – నెవ్వరు సాటి దోసము బాపును బాపును బాపును ||నీ చరణములే||