నీ చిత్తమునే
Nee Chiththamunae
Lyricistశ్రీనివాస్ బండారు
UncategorizedAdded on 5/28/2021
Lyrics
నీ చిత్తమునే నెరవేర్చుటకై నను ఎన్నుకొని నీ కృపావరమునే దానముగా దయచేసి నీ ప్రేమలో పరవశించి నీ సన్నిధిలో నే చేరి నీ నామమును నీ ప్రేమను నేను ఘనపరచెదను దేవా… నా దేవా… నా యేసయ్యా నా రక్షకుడా (2) ||నీ చిత్తమునే|| హృదయము బద్దలై ఏడ్చిన వేళ కన్నీటి ప్రార్దన చేసిన వేళ నీ చిత్తముకై నే ఎదురు చూసి నీ బలము పొంద సహియింప చేసి నా ప్రాణమును తృప్తి పరచితివే ||దేవా|| నాలోని ప్రాణం తల్లడిల్లిపోగా భూదిగంతములనుండి మొర్ర పెట్టుచున్నాను నా శత్రువుపైనే జయమునిచ్చి నా ఆశ్రయమై ధైర్యమును నింపి నా కోట నీవైతివే ||దేవా||