నీ దీర్ఘశాంతమే

Nee Deerghashaamthamae

UncategorizedAdded on 9/21/2017

Lyrics

నీ కరుణా కటాక్షములే నా బ్రతుకుకు ఆధారము
యేసయ్యా… కనిపించరే
నీలాగా ప్రేమించే వారెవరు
(2)    ||నీ దీర్ఘ||
కడుపేద స్థితిలోనే కరువే నా బంధువాయెను
వయసొచ్చిన తరుణములో వస్త్ర హీనతే కృంగదీసెను
(ఏ) ఆధారము కనిపించని నా బ్రతుకులో
ఐశ్వర్యవంతుడ నన్నాదుకున్నావు
యేసయ్యా… కనిపించరే
నీలాగా దీవించే వారెవరు
(2)    ||నీ దీర్ఘ||
ఈ లోక జ్ఞానులలో వెర్రివానిగా ఉంటిని
ఎన్నికైన వారిలో వ్యర్థునిగా మిగిలి ఉంటిని
తృణీకరింపబడిన నా బ్రతుకును
కరుణా సంపన్నుడా నన్నెన్నుకున్నావు
యేసయ్యా… కనిపించరే
నీలాగా కృప చూపే వారెవరు
(2)    ||నీ దీర్ఘ||
నా ప్రాణము నాలో కృంగివున్న సమయములో
జీవము గల నీకై నా ప్రాణము పరితపించెను
మధురమైన నీ సహవాసముతో
నా జీవ నాథుడా నీ మమతను పంచావు
యేసయ్యా… కనిపించరే
నీలాంటి జీవము గల దేవుడెవ్వరు
(2)    ||నీ దీర్ఘ||

Video