నీ ధనము నీ ఘనము
Nee Dhanamu Nee Ghanamu
Lyricistబొంతా సమూయేలు
UncategorizedAdded on 9/27/2016
Lyrics
నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా – వెనుదీతువా ||నీ ధనము|| ధరలోన ధన ధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోక నాధుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా ||నీ ధనము|| పాడిపంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయ నో క్రైస్తవా ||నీ ధనము|| వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించె ప్రభు నీకు ఉచితంబుగా వెలిగించ ధర పైని ప్రభు నామము కలిమి కొలది ప్రభున కర్పింపవా ||నీ ధనము|| కలిగించె సకలంబు సమృద్దిగా తొలగించె పలుభాధ భరితంబులు బలియాయె నీ పాపముల కేసువే చెలువంగ ప్రభుకీయ చింతింతువా ||నీ ధనము||