నీ జల్దరు వృక్షపు

Nee Jaldaru Vrukshapu

Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 12/29/2015

Lyrics

నీ జల్దరు వృక్షపు నీడలలో
నేనానంద భరితుడనైతిని
బలు రక్కసి వృక్షపు గాయములు
ప్రేమా హస్తములతో తాకు ప్రభు
(2)     ||నీ జల్దరు||
నా హృదయపు వాకిలి తీయుమని
పలు దినములు మంచులో నిలచితివి
నీ శిరము వానకు తడిచినను
నను రక్షించుటకు వేచితివి
(2)    ||నీ జల్దరు||
నీ పరిమళ పుష్ప సుగంధములు
నా రోత హృదయమును నింపినవి
ద్రాక్షా రస ధారల కన్న మరి
నీ ప్రేమే ఎంతో అతి మధురం
(2)     ||నీ జల్దరు||
ఓ ప్రియుడా నా అతి సుందరుడా
దవళ వర్ణుడా నాకతి ప్రియుడా
వ్యసనా క్రాంతుడుగా మార్చబడి
నీ సొగసును నాకు నొసగితివి
(2)      ||నీ జల్దరు||

Video