నీ జీవితములో

Nee Jeevithamulo

Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 2/12/2017

Lyrics

నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా
ఈనాడే నీవు ప్రభు యేసుకొరకు నీ హృదయమర్పించవా
(2)     ||నీ జీవితములో||
నీ తల్లి గర్భాన నీవుండినపుడే
నిను చూచే ప్రభు కన్నులు
యోచించలేవా ఏ రీతి నిన్ను
నిర్మించే తన చేతులు
(2)         ||నీ జీవితములో||
నీలోనే తాను నివసింపగోరి
దినమెల్ల చేజాచెను
హృదయంపు తలుపు తెరువంగ లేవా
యేసు ప్రవేశింపను
(2)         ||నీ జీవితములో||
తన చేతులందు రుధిరంపు ధారల్
స్రవియించే నీకోసమే
భరియించె శిక్ష నీకోసమేగా
ఒకసారి గమనించావా
(2)         ||నీ జీవితములో||
ప్రభు యేసు నిన్ను సంధించునట్టి
సమయంబు యీనాడేగా
ఈ చోటనుండి ప్రభు యేసు లేక
పోబోకుమో సోదరా
ఈ చోటనుండి ప్రభు యేసు లేక
పోబోకుమో సోదరీ
||నీ జీవితములో||

Video