నీ జీవితం విలువైనది
Nee Jeevithm Viluvainadi
Lyricistదేవరాజు జక్కి
UncategorizedAdded on 9/15/2018
Lyrics
నీ జీవితం విలువైనది ఏనాడు ఏమరకు శ్రీ యేసు నామం నీకెంతో క్షేమం ఈనాడే యోచించుమా ఓ నేస్తమా తెలియునా ప్రభు యేసు నిన్ను పిలిచెను నా నేస్తమా తెలిసికో ప్రభు యేసు నీకై మరణించెను ||నీ జీవితం|| బలమైన పెను గాలి వీచి అలలెంతో పైపైకి లేచి విలువైన నీ జీవిత నావా తలకిందులై వాలిపోవ వలదు భయము నీకేలా కలదు యేసే నీ తోడు యేసు మరణించి మరి లేచెను నిన్ను ప్రేమించి దరి చేర్చును ||నీ జీవితం|| గాఢాంధకారంపు లోయలో వల గాలి వడి సవ్వడిలో నడయాడి నీ జీవిత త్రోవా సుడివడి నీ అడుగు తడబడిన వలదు భయము నీకేలా కలదు యేసే నీ తోడు యేసు మరణించి మరి లేచెను నిన్ను ప్రేమించి దరి చేర్చును ||నీ జీవితం|| కనలేని గమ్యంబు కోరి ఎనలేని కష్టాల పాలై మనలేని నీ జీవిత గాథా కలలన్ని కన్నీటి వ్యథలే వలదు భయము నీకేలా కలదు యేసే నీ తోడు యేసు మరణించి మరి లేచెను నిన్ను ప్రేమించి దరి చేర్చును ||నీ జీవితం||