నీ జ్ఞాపకం అనేకులను

Nee Jnyaapakm Anaekulanu

Lyricistక్రీస్తు దాస్
UncategorizedAdded on 3/26/2018

Lyrics

నీ జ్ఞాపకం అనేకులను – ప్రభు వైపుకు త్రిప్పుచుండెనా
నీ జ్ఞాపకం ఆత్మీయులకు – క్షేమాభివృద్ధి నిచ్చుఁచుండెనా
నీ జ్ఞాపకం నీవు మరణించినా
మరణాంతర పరిచర్య చేయునా
మరణాంతర పరిచర్య చేయునా
||నీ జ్ఞాపకం||
పేతురన్న జ్ఞాపకం – పశ్చాత్తాప పరిమళం
పౌలన్న జ్ఞాపకం – పోరాటపు ప్రోత్సాహం
నేటికీ స్మరణకు తెచ్చుచుండెగా
క్షేమాభివృద్ధి కలిగించుచుండెగా
(2)     ||నీ జ్ఞాపకం||
బర్నబాన్న జ్ఞాపకం – ఆదరణానందము
తిమోతన్న జ్ఞాపకం – విశ్వాస విజయము
నేటికీ స్మరణకు తెచ్చుచుండెగా
క్షేమాభివృద్ధి కలిగించుచుండెగా
(2)     ||నీ జ్ఞాపకం||
ఫిలిప్పన్న జ్ఞాపకం – సువార్త సునాదము
స్తెఫనన్న జ్ఞాపకం – క్రీస్తుని స్వారూప్యము
నేటికీ స్మరణకు తెచ్చుచుండెగా
క్షేమాభివృద్ధి కలిగించుచుండెగా
(2)     ||నీ జ్ఞాపకం||