నీ కార్యములు
Nee Kaaryamulu
Lyricistవినోద్ కుమార్
UncategorizedAdded on 5/28/2020
Lyrics
నీ కార్యములు ఆశ్చర్యములు దేవా నీవు సెలవియ్యగా – శూన్యము సృష్టిగా మారెనే నీవు సెలవియ్యగా – మారా మధురం ఆయెనే నీవు సెలవియ్యగా – దురాత్మలు పారిపోయెనే నీవు సెలవియ్యగా – దరిద్రము తొలగిపోయెనే మోషే ప్రార్ధించగా – మన్నాను ఇచ్చితివే ఆ మన్నా నీవే యేసయ్యా ఏలియా ప్రార్ధించగా – ఆహారమిచ్చితివే నా పోషకుడవు నీవే కదా (2) ||నీవు సెలవియ్యగా|| లాజరు మరణించగా – మరణము నుండి లేపితివే మోడైనను చిగురింపచేసెదవు కానాన్ వివాహము ఆగిపోవుచుండగా నీ కార్యముతో జరిగించితివే నీ కార్యముతో సెలవిమ్మయ్యా సెలవిమ్మయ్యా ఈ క్షణమే యేసయ్యా (8) ౹౹నీవు సెలవియ్యగా౹౹