నీ కృప చాలునయా

Nee Krupa Chaalunayaa

UncategorizedAdded on 1/28/2019

Lyrics

నీ మేలునే కోరితి మెస్సయ్యా నను కాయువాడా
స్తుతి ఘనత మహిమ నిరతము నీకే చెల్లును
నన్నెంతగానో ప్రేమించి నీవు నీ చేతిలో నను చెక్కుకుంటివి
నా సహవాసం నీతో నుండను నీ రూపులో నను చేసుకొంటివి
ఇంతటి భాగ్యము పొందుటకు ఎంతటి వాడను నేను ప్రభు
||నీ కృప||
పడియున్న నన్ను చెడనియ్యకా నీ జీవము నాలో నుంచినావు
పరిశుద్ధ రక్తం నాకై కార్చి నీ దివ్య రక్షణ నిచ్చినావు
నన్నాదరించిన నజరేయుడా నిన్నేన్నడు నేను మరువనయ
||నీ కృప||
నలిగిన హృదయం విరిగిన మనసుతో నీ నామ గానం చేసెద (యేసయ్య)
నీ మధుర స్వరం ప్రతి దినం నే వినుచు ఆస్వాదించెద
చాలునయా నాకీ జీవితం నీ సేవకే అది అంకితం
||నీ కృప||