నీ కృప లేని క్షణము
Nee Krupa Laeni Kshanamu
UncategorizedAdded on 7/22/2017
Lyrics
పాకలపాటి జాన్ వెస్లీ యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా నీ కృప లేని క్షణము – నీ దయ లేని క్షణము నేనూహించలేను యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా (2) ||నీ కృప|| మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు మహిమలో నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప (2) ||యేసయ్యా|| ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు ఆత్మీయులతో ఆనందింప చేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆశ తీర ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప (2) ||యేసయ్యా||