నీ కృప నిత్యముండును

Nee Krupa Nithyamumdunu

Lyricistహోసన్నా మినిస్ట్రీస్
UncategorizedAdded on 3/27/2017

Lyrics

నీ కృప నిత్యముండును
నీ కృప నిత్య జీవము
నీ కృప వివరింప నా తరమా యేసయ్యా
నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది
రక్షణ సంగీత సునాదము
(2)        ||నీ కృప||
శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లె
కృతజ్ఞతనిచ్చావు కృపలో నిలిపావు
కృంగిన వేళలో నను లేవనెత్తిన చిరునామా నీవేగా
(2)        ||నీ కృప||
ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లె
ప్రతి క్షణమున నీవు పలుకరించావు
ప్రతికూలమైన పరిస్థితిలన్నియు కనుమరుగైపోయెనే
(2)        ||నీ కృప||
అనుభవ అనురాగం కలకాలమున్నట్లె
నీ రాజ్యనియమాలలో నిలువనిచ్చావు
రాజమార్గములో నను నడుపుచున్న రారాజువు నీవేగా
(2)        ||నీ కృప||

Video