నీ నామం అతి మధురం
Nee Naamm Athi Madhurm
Lyricistక్రాంతి చేపూరి
UncategorizedAdded on 1/29/2019
Lyrics
నీ నామం అతి మధురం నీ గానం నే చేసెదను నిన్నా నేడు నిరతం ఏకరీతిగ ఉన్న నామము ఎన్ని తరములైనా మార్పుచెందని ఘన నామము మహోన్నతమైనది యేసు నీ నామము కీర్తింపతగినది సాటిలేని నీ నామం ||నీ నామం|| ఆదరించే నామం – ఆశ్రయంబగు నామం ఆలకించే నామం – ఆత్మతో నడిపే నామం అన్ని నామములకు పైన నామం ఉన్నతంబగు నీ నామం ||నీ నామం|| జాలి గలిగిన నామం – జాగు చేయని నామం జవాబు నొసగే నామం – జయమునిచ్చే నామం (2) జుంటె తేనె కన్న మధురం జీవ జలమగు నీ నామం ||నీ నామం||