నీ పాదాలే నాకు శరణం

Nee Paadaalae Naaku Sharanm

Lyricistమాథ్యూస్
UncategorizedAdded on 8/9/2017

Lyrics

నీ పాదాలే నాకు శరణం
యేసయ్యా నీవే ఆధారము
నా ఆశ్రయ పురము – ఎత్తైన కోటవి నీవేనయ్యా
నా దాగు చాటు నీవే యేసయ్యా
(2)       ||నీ పాదాలే||
అలసిన సమయములో ఆశ్రయించితి నీ పాద సన్నిధి
నా ఆశ్రయుడా నీ కన్నా నాకు
కనిపించదు వేరొక ఆశ్రయము
కనిపించదు వేరొక ఆశ్రయము
శరణం శరణం శరణం
నీవే శరణం యేసయ్యా
(2)       ||నీ పాదాలే||
ఇరుకు ఇబ్బందులలో చూచుచుంటిని నీ వైపు నేను
నా పోషకుడా నీ కన్న నాకు
కనిపించరే వేరొక పోషకుడు
కనిపించరే వేరొక పోషకుడు
శరణం శరణం శరణం
నీవే శరణం యేసయ్యా
(2)       ||నీ పాదాలే||
సాతాను శోధనలో పరుగెత్తితిని నీ వాక్కు కొరకు
నా జయశీలుడా నీకన్న నాకు
కనిపించరే జయమును ఇచ్చే వేరొకరు
కనిపించరే జయమునిచ్చే వేరొకరు
శరణం శరణం శరణం
నీవే శరణం యేసయ్యా
(2)       ||నీ పాదాలే||

Video