నీ పాదాలు తడపకుండా
Nee Paadaalu Thadapakumdaa
Lyricistఫిన్నీ అబ్రహాం
UncategorizedAdded on 6/30/2023
Lyrics
ప్రార్థన వలనే పయనము – ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము – ప్రార్థన లేనిదే పరాజయం ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా (2) ||ప్రార్థన|| ప్రార్ధనలో నాటునది – పెల్లగించుట అసాధ్యము ప్రార్ధనలో పోరాడునది – పొందకపోవుట అసాధ్యము ప్రార్ధనలో ప్రాకులాడినది – పతనమవ్వుట అసాధ్యము ప్రార్ధనలో పదునైనది – పనిచేయకపోవుట అసాధ్యము (2) ||ప్రభువా|| ప్రార్ధనలో కనీళ్లు – కరిగిపోవుట అసాధ్యము ప్రార్ధనలో మూల్గునది – మరుగైపోవుట అసాధ్యము ప్రార్ధనలో నలిగితే – నష్టపోవుట అసాధ్యము ప్రార్ధనలో పెనుగులాడితే – పడిపోవుట అసాధ్యము (2) ||ప్రభువా||