నీ పాదం మ్రొక్కెదన్
Nee Paadm Mrokkedan
UncategorizedAdded on 1/15/2016
Lyrics
నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా… నీ ప్రేమ పొంగుచున్నది పరిశుద్ధమైన పరవశమే పరమ యేసుని కృపా వరమే వెదకి నన్ను కనుగొంటివి పాడుటకు పాటనిచ్చితివి ||నీ పాదం|| నూతన నూనె ప్రభావముతో నూతన కవిత్వపు కృపతోను నింపి నిత్యము నడిపితివి నూతన షాలేము చేర్చేడవు ||నీ పాదం|| ఇరుకు నందు పిలచితివి నాకు సహాయము చేసితివి చెడి ఎక్కడ తిరుగకుండా చేరవచ్చి నన్ను ఆడుకొంటివి ||నీ పాదం|| నిత్యముగ నీ సన్నిధి నాకు ఇచ్చును విశ్రాంతిని దుడ్డు కర్ర నీ దండమును నిజముగ నన్ను ఆదరించును ||నీ పాదం|| ఫలించు చెట్టు నీవు నిలచు తీగగా నేను వ్యాపించుటకై కొమ్మ నరికి కలుపు తీసి కాపాడి శుద్దీకరించితివి ||నీ పాదం|| పరిశుద్ధమైన కీర్తితోను ప్రకాశమైన శిఖరముపై శీఘ్రముగ చేర్చెదవు సీయోనులో నిన్ను కీర్తించెదన్ ||నీ పాదం||