నీ ప్రేమ ఎంతో

Nee Praema Emtho

Lyricistఅబ్రహాం
UncategorizedAdded on 11/25/2015

Lyrics

నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం
యేసు
యేసయ్యా నీ ప్రేమ మధురం
యేసయ్యా మధురాతి మధురం
(2)     ||నీ ప్రేమ||
మరచిపోనిది నీ ప్రేమా
నన్ను మార్చుకున్నది నీ ప్రేమా
కన్ను రెప్ప లాంటిది నీ ప్రేమా
జీవ కాలముండును నీ ప్రేమా
(2)      ||నీ ప్రేమ||
సిలువకెక్కెను నీ ప్రేమా
నాకు విలువ నిచ్చెను నీ ప్రేమా
నాకై మరణించెను నీ ప్రేమా
నాకై తిరిగి లేచెను నీ ప్రేమా
(2)     ||నీ ప్రేమ||
తల్లికుండునా నీ ప్రేమా
సొంత చెల్లికుండునా నీ ప్రేమా
అన్నకుండునా నీ ప్రేమా
కన్న తండ్రికుండునా నీ ప్రేమా
(2)       ||నీ ప్రేమ||
త్యాగమున్నది నీ ప్రేమలో
దీర్ఘ శాంతమున్నది నీ ప్రేమలో
బలమున్నది నీ ప్రేమలో
గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో
(2)         ||నీ ప్రేమ||

Video