నీ ప్రేమ నాలో మధురమైనది

Nee Praema Naalo Madhuramainadi

Lyricistహోసన్నా మినిస్ట్రీస్
UncategorizedAdded on 5/24/2020

Lyrics

నీ ప్రేమ నాలో మధురమైనది
అది నా ఊహకందని క్షేమ శిఖరము
ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను
పరవశించి నాలో మహిమపరతు నిన్నే
సర్వకృపానిధి నీవు – సర్వాధికారివి నీవు
సత్య స్వరూపివి నీవు – ఆరాధింతును నిన్నే
||నీ ప్రేమ||
చేరితి నిన్నే విరిగిన మనస్సుతో
కాదనలేదే నా మనవులు నీవు
హృదయము నిండిన గానం – నను నడిపే ప్రేమ కావ్యం
నిరతము నాలో నీవే – చెరగని దివ్య రూపం
ఇది నీ బాహు బంధాల అనుబంధమా
తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
నా యేసురాజా ఆరాధన నీకే
(2)         ||నీ ప్రేమ||
నా ప్రతి పదములో జీవము నీవే
నా ప్రతి అడుగులో విజయము నీవే
ఎన్నడు విడువని ప్రేమ – నిను చేరే క్షణము రాదా
నీడగా నాతో నిలిచే – నీ కృపయే నాకు చాలును
ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా
తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
నా యేసురాజా ఆరాధన నీకే
(2)         ||నీ ప్రేమ||
నీ సింహాసనము నను చేర్చుటకు
సిలువను మోయుట నేర్పించితివి
కొండలు లోయలు దాటే – మహిమాత్మతో నింపినావు
దయగల ఆత్మతో నింపి – సమాభూమిపై నడిపినావు
ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా
తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
నా యేసురాజా ఆరాధన నీకే
(2)         ||నీ ప్రేమ||

Video