నీ ప్రేమకు సాటి

Nee Praemaku Saati

UncategorizedAdded on 10/1/2018

Lyrics

ప్రేమారూపా యేసురాజా
నింగియందునా – నేల యందునా
పాతాళమందునా – ఎందైన గాని
నీకన్నా అధికులు ఎవరు లేనే లేరు
||నీ ప్రేమకు||
పాపినైన నా కొరకు – పరలోకం విడచినదెవరు
నా పాపముల కొరకై – సిలువలో మరణించినదెవరు
క్షమియించి రక్షించిన నా తండ్రి నీవే
||నీ ప్రేమకు||
ధరలోని ధన ధాన్యములు – నన్ను వీడినా
ఇలలో నా సరివారు – త్రోసివేసినా
ఇహమందు పరమందు నా ధనము నీవే
||నీ ప్రేమకు||

Video