నీ ప్రేమకు సాటి లేదయా

Nee Praemaku Saati Laedayaa

Lyricistశ్రీనివాస్ బండారు
UncategorizedAdded on 8/19/2021

Lyrics

నీ ప్రేమకు సాటి లేదయా
యేసయ్యా… నీ సన్నిధి నాకు మేలయ్యా
నా కొరకై ప్రాణమిచ్చితివి
నా కొరకై సిలువనెక్కితివి
కరుణించి కాపాడుమా నా యేసయ్యా
కన్నీటి ప్రార్దన ఆలకించుమా
(2)         ||నీ ప్రేమకు||
అవిశ్వాసురాలై నేనుండగా అంధకారమందు రక్షించితివే
నా దీనస్థితిలో నా దరికి చేరి నీ వాక్యముతో బలపరచితివే
మనోహరమైన నీ కృపనిచ్చి నన్నాదరించితివే
నా బ్రతుకు దినములన్ని నిను వేడెదన్ నా యేసయ్యా
నా యేసయ్యా….
||నీ ప్రేమకు||
ఏమివ్వగలను నీ ప్రేమకు నా సర్వము నీవేనయా
నా అతిశయము ఆధారము నాకన్నియు నీవేనయా
విశ్వాసముతో నీటిపైన నన్ను నడువనిమ్ము
నా అడుగులు తడబడగా నన్నెత్తుకో నా యేసయ్యా
నా యేసయ్యా….
||నీ ప్రేమకు||

Video