నీ ప్రియ ప్రభుని సేవకై

Nee Priya Prabhuni Saevakai

Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 5/13/2016

Lyrics

నీ ప్రియ ప్రభుని సేవకై – అర్పించుకో నీవే
పవిత్ర ప్రజలైన మీరు – సేవించుడాయననే
అంధకార జీవితమునకు – వెలుగు తెచ్చెను తానే
ఆ వెలుగు ద్వారానే – నూతన మార్గము కలిగె
సజీవ బలిగా నర్పించు – నీ జీవితమాయనకే
(2)       ||నీ ప్రియ||
తప్పిపోతివి గతమందు – తప్పు దారిని నడిచితివి
తన ప్రేమా హస్తమే – నిన్ను కాపాడి తెచ్చెను
యెంతైన స్మరియించు నీవు – వింతైన తన ప్రేమన్
(2)         ||నీ ప్రియ||
ఓ ప్రియుడా తలచితివా – నీ జన్మమే పాపమని
ప్రభువే తన రక్తముతో – నీ పాపము క్షమియించె
నీ యుల్లము ఆయన కాలయమే – జ్ఞాపకముంచుకొనుము
(2)          ||నీ ప్రియ||
యెవరతని సేవించెదరో – ఫలమొందెదరంతమందు
ఇతరులకు లేనట్టి – ఆ ఘనతను నీ కిచ్చె
కృతజ్ఞుడవై కొనియాడు – ప్రభు పాద సన్నిధిని
(2)          ||నీ ప్రియ||

Video