నీ రక్త ధారలే
Nee Raktha Dhaaralae
Lyricistదియ్యా ప్రసాద రావు
UncategorizedAdded on 4/3/2016
Lyrics
నీ రక్త ధారలే – మా జీవనాధారాము నీ సిల్వ మార్గమే – మా మోక్ష భాగ్యము ఓ సిల్వ రాజ – క్రీస్తు రాజ నీతి రాజ – యేసు రాజ మాలోన పలికించు జీవన రాగము – నీ ఆర్తనాదములే మాలోన వెలిగించు జీవన జ్యోతులు – నీ సిల్వ రూపమే ||ఓ సిల్వ|| మమ్మును నడిపించు పరలోకమునకు – నీ సత్య వాక్యమే పాపపు చీకట్లు పారద్రోలెను – నీ నీతి ప్రభావమే ||ఓ సిల్వ|| నీ సిలువ మరణము మనుజాళికంత – కలిగించె రక్షణ నీ మరణ విజయము జగమందు వెలుగొందు – క్రైస్తవ విజయమై ||ఓ సిల్వ||