నీ రక్తమే నీ రక్తమే
Nee Rakthamae Nee Rakthamae
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 2/9/2013
Lyrics
నీ రక్తమే నీ రక్తమే నన్ శుద్దీకరించున్ నీ రక్తమే నా బలము నీ రక్త ధారలే ఇల పాపికాశ్రయంబిచ్చును పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము ||నీ రక్తమే|| నశించు వారికి నీ సిలువ వెర్రితనముగ నున్నది రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తియై యున్నది ||నీ రక్తమే|| నీ సిల్వలో కార్చినట్టి విలువైన రక్తముచే పాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవ తనయుడా ||నీ రక్తమే|| పంది వలె పొర్లిన నన్ను కుక్క వలె తిరిగిన నన్ను ప్రేమతో చేర్చుకొంటివి ప్రేమార్హ నీకే స్తోత్రము ||నీ రక్తమే|| నన్ను వెంబడించు సైతానున్ నన్ను బెదరించు సైతానున్ దునుమాడేది నీ రక్తమే దహించేది నీ రక్తమే ||నీ రక్తమే|| స్తుతి మహిమ ఘనతయు యుగయుగంబులకును స్తుతి పాత్ర నీకే చెల్లును స్తోత్రార్హుడా నీకే తగును ||నీ రక్తమే||