నీ రూపం నాలోన
Nee Roopm Naalona
UncategorizedAdded on 2/2/2021
Lyrics
నీ ప్రేమా నీ కరుణా – నా హృదిలోన ప్రవహించనీ రాజువు నీవే కదా – నీ దాసుడ నేనే కదా ప్రభు నీ కోసం ప్రతి క్షణం జీవించనీ నీ రూపము నాలో ముద్రించనీ (2) ||నీ రూపం|| నా ముందు నీవు ఎడారులన్ని నీటి ఊటలుగా మార్చెదవే దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా ఆశీర్వాదము నీవే రాజా (2) ||నీ రూపం|| నా పాప స్వభావం తొలగించుమయ్యా నీ మంచి ప్రేమ నాకీయుమా నీవు కోరేటి ఆలయమై నేను ఉండాలి హృదయాసీనుడా నా యేసయ్యా (2) ||నీ రూపం|| అంధకారము వెలుగుగా మార్చి శాంతి మార్గములో నడిపెదవే భయపడిన వేళలో తోడుగా నిలిచెదవే భుజమును తట్టి నడిపెదవే (2) ||నీ రూపం||