నీ రూపు చూడ

Nee Roopu Chooda

Lyricistదియ్యా ప్రసాద రావు
UncategorizedAdded on 2/4/2015

Lyrics

నీ రూపు చూడ నేనాశపడితి
నీ దర్శనమునే నే కోరుకుంటి
నీ సుందర రూపము చూపించు దేవా
నీ మెల్లని స్వరమును వినిపించు ప్రభువా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
ఆమెన్ హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా
పదివేలమందిలో అతి సుందరుడా
పరలోకనాథా అతికాంక్షనీయుడా
నా ఆశ తీరగను నిన్ను నేను చూడాలి
మధురాతి మధురంబు నీ స్వరము వినాలి
||హల్లెలూయా||
నీ సన్నిధిలో సుఖ శాంతి దొరికే
నీ మాటతోనే జీవంబు కలిగే
నీ తోడు నీడలో నా బ్రతుకు సాగాలి
నీ దరహాసములో నేనెదిగి పోవాలి
||నీ రూపు||

Video