నీ స్నేహము

Nee Snaehamu

Lyricistజాషువా షేక్
UncategorizedAdded on 1/5/2018

Lyrics

నీ స్నేహము ఎంతో సత్యము
ఆద్యంతము నా హృదిలో పదిలము
నా సఖుడా ప్రియ యేసయ్య
నా హితుడా స్నేహితుడా
నీవెంత గొప్ప వాడివయ్యా
నను ఆదరించినావయ్యా
సింహాల బోనులో నా ప్రాణానికి
ప్రాణమైన నా విభుడవు
చెరసాలలోన సంకెళ్ళు విరచి
విడుదల నిచ్చిన రక్షక
కన్న తల్లి కూడా నన్నెరుగక మునుపే
నన్నెరిగిన నా తండ్రివి
||నా సఖుడా||
గొల్యాతయినా ఏ యుద్ధమైనా
విజయము నిచ్చిన వీరుడవు
పదివేలమంది నా వైపు కూలినా
నాతో నిలచిన ధీరుడవు
నా దోశములను నీదు రక్తముతో
తుడిచివేసిన పరిశుద్ధుడవు
||నా సఖుడా||
ఏ ఎన్నిక లేని నను ప్రేమించిన కృపామయుడవు
అందరు విడిచిన నన్నెన్నడు విడువని కరుణామయుడవు
నిస్సారమైన నా జీవితములో
సారము పోసిన సజీవుడవు
(2)        ||నా సఖుడా||

Video