నీ వాక్యమే నన్ను బ్రతికించెను

Nee Vaakyamae Nannu Brathikimchenu

UncategorizedAdded on 6/7/2016

Lyrics

బాధలలో నెమ్మదినిచ్చెను
కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడా
వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా
(2)      ||నీ వాక్యమే||
జిగటగల ఊభినుండి లేవనెత్తెను
సమతలమగు భూమిపై నన్ను నిలిపెను
నా పాదములకు దీపమాయెను
సత్యమైన మార్గములో నడుపుచుండెను
(2)       ||నీ వాక్యమే||
శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై
యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది
అపవాది వేయుచున్న అగ్ని బాణములను
ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పి వేయుచున్నది
(2)       ||నీ వాక్యమే||
పాలవంటిది జుంటి తేనె వంటిది
నా జిహ్వకు మహా మధురమైనది
మేలిమి బంగారు కన్న మిన్న అయినది
రత్న రాసులకన్నా కోరతగినది
(2)           ||నీ వాక్యమే||

Video