నీ వాక్యమే శ్రమ కొలిమిలో
Nee Vaakyamae Shrama Kolimilo
Lyricistరంజిత్ ఓఫిర్
UncategorizedAdded on 4/1/2021
Lyrics
నీ వాక్యమే శ్రమ కొలిమిలో నను బ్రతికించుచున్నది నా బాధలో అది బహు నెమ్మది కలిగించుచున్నది ||నీ వాక్యమే|| శ్రమయందు నాకు నీ ధర్మశాస్త్రము సంతోషమీయని యెడల బహు కాలము క్రితమే నేను – నశియించియుందునయ్యా నీ ఆజ్ఞలను బట్టి ఆనందింతున్ ప్రభు ||నీ వాక్యమే|| నీ శాసనములే ఆలోచన- కర్తలై నన్ను నడుపుట వలన నా శత్రువుల మించిన జ్ఞానము – నాకిలను కలిగెనయ్యా నీ ఆజ్ఞలను నేను తలదాల్తును ప్రభు ||నీ వాక్యమే|| వేలాది వెండి బంగారు నాణెముల విస్తార ధన నిధి కన్నా నీ ధర్మశాస్త్రము యెంతో – విలువైన నిధి ప్రభువా నీ ఆజ్ఞలను బట్టి నిను పొగడడం ప్రభు ||నీ వాక్యమే||