నీదు ప్రేమ నాలో
Needu Praema Naalo
Lyricistప్రభు పమ్మి
UncategorizedAdded on 7/7/2018
Lyrics
నీదు ప్రేమ నాలో ఉంచి జీవమునిచ్చావు నీదు రూపమే నాలో ఉంచి నన్ను చేసావు మంటివాడను నన్ను నీవు మహిమపరిచావు మరణపాత్రుడనైన నన్ను పరము చేర్చావు ఎంత ప్రేమ యేసయ్యా – నీకెంత నాపై కరుణయో మరువగలనా నీ కృప – బ్రతుకంతయు తోడువైనావు నా నీడవైనావు నీవు నాకు ఉండగా నాకు ఈ దిగులెందుకు మంచి కాపరి నీవేనయ్యా నా యేసయ్యా ఎంచలేనయ్యా నీ వాత్సల్యం ఓ మెస్సయ్యా జీవితమంతా మరువలేనయ్యా ||నీదు ప్రేమ|| ప్రాణమైనావు నీవే ధ్యానమైనావు అన్నీ నీవై చేరదీసి ఆశ్రయమైనావు నీతిసూర్యుడా పరిపూర్ణుడా నిత్య దేవుడా కీర్తనీయుడా కృపాపూర్ణుడా సత్యజీవుడా నేను నిన్ను విడువలేనయ్యా ||నీదు ప్రేమ||