నీదు ప్రేమకు హద్దు లేదయా
Needu Praemaku Haddu Laedayaa
UncategorizedAdded on 9/9/2016
Lyrics
నీదు ప్రేమకు కొలత లేదయా నీదు ప్రేమకు సాటి రారయా.. ఎవ్వరు పొగడదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా ||నీదు|| తల్లి తండ్రులు చూపలేని ప్రేమ తనయులివ్వని తేటనైన ప్రేమ పేదలకు నిరు పేదలకు విధవలకు అనాథలకు బంధు మిత్రులు చూపలేని ప్రేమా కొనియాడదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా ||నీదు|| నరులకై నర రూపమైన ప్రేమ పరము చేర్చగ ప్రాణమిచ్చిన ప్రేమ దొంగలకు వ్యభిచారులకును కౄరులకు నర హంతకులకు మనుజులివ్వని మధురమైన ప్రేమా కీర్తించదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా ||నీదు||