నీదు విశ్వాస్యత
Needu Vishvaasyatha
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 7/16/2016
Lyrics
నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నధిగమించెను నిను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మానుజావళికి నిబంధనను స్థిరముగ జేసి నిరతము నలరారెడు మా ప్రభువా వేయి తరముల వరకు సరిగా విలసిల్లేటి వెలలేని మా వింతల కృపాంబుధి యగు దేవా యెంతయో నిను స్తుతియింతుము కోరి నీ సత్య సంధత్వ మహిమ నిరతము నిలయం సంస్తుతులకు మెరసెను నా మదిలోన దేవా మరువగ లేమి మధుర ప్రేమ ఎంతైనను నమ్మదగిన వింతైన నీ విశ్వాస్యత వాత్సల్యత వెలసెను మాపై క్రొత్తగా ప్రతి దినము యేసు ప్రభు మన ఆత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు వొనరుగ కాపాడును పదిలముగా దిన దినమును నిందారహితముగా తండ్రి కుమార శుద్ధాత్మకును తర తరములకు మహిమ ఘనత పరిపూర్ణముగా ప్రబలును గాక పరి పరి విధముల ప్రభు సంఘములో