నీకసాధ్యమైనది ఏదియు లేదు

Neekasaadhyamainadi Aediyu Laedu

UncategorizedAdded on 6/20/2017

Lyrics

నీకసాధ్యమైనది ఏదియు లేదు
సమస్తము సాధ్యము నీకు
ప్రభువా ప్రభువా
సమస్తము సాధ్యం
(2)       ||నీకసాధ్యమైనది||
వ్యాధులనుండి స్వస్థపరచుట సాధ్యం – సాధ్యం
బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం – సాధ్యం
నీకు సాటియైన దేవుడు లేనే లేడు యేసయ్యా
నీకు సాటియైన దేవుడు జగమున లేనే లేడయ్యా
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా – నా యేసయ్యా
(2)       ||నీకసాధ్యమైనది||
పాపమునుండి విడిపించుట సాధ్యం – సాధ్యం
శాపమునుండి విముక్తినిచ్చుట సాధ్యం – సాధ్యం
నీలా ప్రేమించే దేవుడు లేనే లేడు యేసయ్యా
నీలా ప్రేమించే దేవుడు జగమున లేనే లేడయ్యా
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా – నా యేసయ్యా
(2)       ||నీకసాధ్యమైనది||
దుష్ట శక్తులను కాల్చివేయుట సాధ్యం – సాధ్యం
నీతి రాజ్యమును స్థాపించుట సాధ్యం – సాధ్యం
నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు లేడు యేసయ్యా
నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు జగమున లేనే లేడయ్యా
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా – నా యేసయ్యా
(2)       ||నీకసాధ్యమైనది||
సర్వ సత్యములో నడిపించుట సాధ్యం – సాధ్యం
పరిశుద్ధాత్మను అనుగ్రహించుట సాధ్యం – సాధ్యం
నీలా పరిశుద్ధ దేవుడు లేనే లేడు యేసయ్యా
నీలా పరిశుద్ధ దేవుడు జగమున లేనే లేడయ్యా
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా – నా యేసయ్యా
(2)       ||నీకసాధ్యమైనది||

Video