నీలో జీవించాలని
Neelo Jeevimchaalani
Lyricistకే వై రత్నం
UncategorizedAdded on 8/21/2018
Lyrics
నీలో జీవించాలని నీలోనే బ్రతకాలని యుగయుగాల నీతోనే ఉండాలని తుది శ్వాస వరకు నీలోనే నా గమ్యం యేసూ నువ్వే కావాలి నా యేసూ నీతో ఉండాలి మిగిలింది నాకు నిత్య శోకము ఈ నా జీవిత యాత్రలో కన్నీళ్లే నాకు అన్న పానములై భుజియించుచుంటిని నిత్యము ప్రభువా నీవు నాకు ప్రత్యక్షము అయిన వెంటనే నా దుఃఖ దినములన్ని సమాప్తమాయెను కటిక చీకటే నాకు స్నేహమాయెను అంధకారమే నాలో నాట్యమాడెను ఎటు వైపు చూసినా వెలుగు కాన రాలేదు మార్గమే తెలియక మతి చెలించెను నీ వైపు చూడగానే వెలుగు కలిగె దేవా నీ నామమే నాకు మార్గమాయెను