నీతి న్యాయములు

Neethi Nyaayamulu

Lyricistహోసన్నా మినిస్ట్రీస్
UncategorizedAdded on 2/28/2017

Lyrics

నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా
నిత్య జీవార్థమైనవి నీ శాసనములు
వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా
నీ ప్రియమైన స్వాస్థ్యమును
రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను
నీ రాజ్య దండముతో
||నీతి||
ప్రతి వాగ్ధానము నా కొరకేనని
ప్రతి స్థలమందు – నా తోడై కాపాడుచున్నావు నీవు
నిత్యమైన కృపతో నను బలపరచి
ఘనతను దీర్గాయువును దయచేయువాడవు
పరిమళ వాసనగ నేనుండుటకు
పరిశుద్ధ తైలముతో – నన్నభిషేకించి యున్నావు నీవు
ప్రగతి పథములో నను నడిపించి
ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు
నిత్య సీయోనులో నీతో నిలుచుటకు
నిత్య నిబంధనను – నాతో స్థిరపరచుచున్నావు నీవు
మహిమ కలిగిన పాత్రగ ఉండుటకు
ప్రజ్ఞ వివేకములతో నను నింపువాడవు

Video