నీతిగల యెహోవా స్తుతి

Neethigala Yehovaa Sthuthi

Lyricistపసుపులేటి దావీదు
UncategorizedAdded on 7/14/2016

Lyrics

నీతిగల యెహోవా స్తుతి మీ – ఆత్మతో నర్పించుడి
మీ ఆత్మతో నర్పించుడి – దాతయవు మన క్రీస్తు నీతిని
దాల్చుకొని సేవించుడి
||నీతి||
చదల బుడమియు రవియు జలధియు – నదులు గిరులును జక్కగా
సదమలంబగు దైవ నామము – సర్వదా నుతి జేయును
||నీతి||
సర్వశక్తుని కార్యముల కీ – సర్వ రాష్ట్రము లన్నియు
గర్వములు విడి తలలు వంచుచు – నుర్విలో నుతిజేయను
||నీతి||
గీత తాండవ వాద్యములచే – బ్రీతి పరచెడు సేవతో
పాతకంబులు పరిహరించెడు – దాతనే సేవించుడి
||నీతి||
పరమ దూతలు నరులు పుడమిని – మొరలుబెట్టుచు దేవుని
పరము నందున్నట్టి యేసుని – పాదములు సేవింతురు
||నీతి||
ఇలను భక్తులు గూడుకొనియా – బలము గల్గిన దేవుని
వెలయు స్తుతి వే నోళ్ళతోడను – విసుగు జెందక జేయుడి
||నీతి||
ఆత్మ నీవిక మేలుకొని శు – ధ్ధాత్మ యేసుని దండ్రిని
త్రిత్వమగునా యేక దేవుని – హర్షమున సేవింపవే
||నీతి||

Video