నీతో నా జీవితం
Neetho Naa Jeevithm
Lyricistహోసన్నా మినిస్ట్రీస్
UncategorizedAdded on 6/26/2018
Lyrics
నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నా యేసయ్యా కృప చూపుచున్నావు – వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు – స్ఫూర్తిప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా… నీతో నా అనుబంధం మాధుర్యమే భీకర ధ్వనిగలా మార్గమునందు నను స్నేహించిన నా ప్రియుడవు నీవు కలనైన మరువను నీవు నడిపిన మార్గం క్షణమైన విడువను నీతో సహవాసం (2) ||ఆరాధ్యుడా|| సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే నిత్యమైన మహిమలో నను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నను మార్చుచున్నావు (2) ||ఆరాధ్యుడా|| ఆకాశమందుండి ఆశీర్వదించితివి అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నను నింపుచున్నావు (2) ||నీతో నా||