నీతో నుండని బ్రతుకు

Neetho Numdani Brathuku

Lyricistరాజ్ ప్రకాష్ పాల్
UncategorizedAdded on 3/12/2017

Lyrics

నీతో నుండని బ్రతుకు – నిను చూడని క్షణము
ఊహించలేను నా యేసయ్యా
నిను చూడని క్షణము – నీతో నుండని బ్రతుకు
ఊహించలేను నా యేసయ్యా
నీదు స్వరము వినకనే నేను
నిను విడచి తిరిగితి నేను
నాదు బ్రతుకులో సమస్తము కోలిపొయితి
నీ దివ్య ప్రేమను విడచి – నీ ఆత్మ తోడు త్రోసివేసి
అంధకార త్రోవలో నడచి – నీ గాయమే రేపితిని
అయినా అదే ప్రేమ – నను చేర్చుకున్నప్రేమ
నను వీడని కరుణ – మరువలేనయ్యా యేసయ్యా
||నీతో||
నను హత్తుకున్న ప్రేమ – నను చేర్చుకున్న ప్రేమ
నీ వెలుగులోనే నిత్యం – నే నడిచెదన్
నను విడువకు ప్రియుడా – నాకు తోడుగా నడువు
నీతోనే నా బ్రతుకు – సాగింతును యేసయ్యా
||నిను||

Video