నీతో సమమెవరు
Neetho Samamevaru
Lyricistఆకుమర్తి డేనియల్
UncategorizedAdded on 12/5/2015
Lyrics
నీతో సమమెవరు – నీలా ప్రేమించేదవరు నీలా క్షమియించేదెవరు – యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన – వారెవరు లోక బంగారము – ధన ధాన్యాదులు ఒక పోగేసినా – నీతో సరితూగునా జీవ నదులన్నియు – సర్వ సంద్రములు ఒకటై ఎగసినా – నిన్ను తాకగలవా లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు ||నీతో|| పలు వేదాలలో – మత గ్రంథాలలో పాపమే సోకని – పరిశుద్దుడేడి పాప పరిహారార్థం – సిలువ మరణమొంది తిరిగి లేచినట్టి – దైవ నరుడెవ్వరు నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా నీవేగా మంచి దేవుడవు ||నీతో|| నేను వెదకకున్నా – నాకు దొరికితివి నేను ప్రేమించకున్నా – నన్ను ప్రేమించితివి పలు గాయాలు చేసి – తరచు రేపితిని నన్నెంతో సహించి – క్షమియించితివి నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి నీవేగా విమోచకుడవు ||నీతో||