నీవే నా సర్వము

Neevae Naa Sarvamu

UncategorizedAdded on 8/30/2018

Lyrics

నీవే నా సర్వము అన్నిటిలో
నీ జీవం నా కొరకు ఇచ్చినందున
నీవే నా సర్వము అన్నిటిలో
తేనె కంటే మధురము
యేసయ్యే నాకు మాధుర్యము
రుచి చూచి ఎరిగితిని కృపా బాహుళ్యమును
యేసయ్యే నాకు మాధుర్యము
||తేనె||
నీవే నా రక్షణ నీవే నిరీక్షణ
నీవే కదా నా ఆధారము
నీ పాదములకు మ్రొక్కెదను
నీ నామం పాడి స్తుతించెదను
నీవే పరిహార నీవే పరమౌషధం
నీవే నా శక్తివి నా యేసయ్యా
కల్వరి సిలువపై బాలి అయితివే
నే బాగుపడితిని గాయములచే
నీవే నా కీర్తివి నీవే నా అతిశయం
నీవే నా మేలులు నా యేసయ్యా
నీ పాద సేవయే చేయుటయే
నా హృదయములున్న వాంఛయేగా

Video