నీవే నన్ను కోరుకున్నావు
Neevae Nannu Korukunnaavu
UncategorizedAdded on 9/6/2017
Lyrics
నీవే నన్ను కోరుకున్నావు నీవే నన్ను చేరుకున్నావు నీవే నన్ను విడిపించావు నీవే నన్ను విడువనన్నావు ఎంత ప్రేమ యేసయ్యా వింత ప్రేమ నీడయ్యా నీ అరచేతిలో నను చెక్కుకున్నావు నీ కృపలో నన్ను ఎన్నుకున్నావు నీ రాజ్యములో నను దాచి ఉంచావు నీ నామములో నను రక్షించావు ||ఎంత|| నీ వాక్యముతో నను శుద్ధి చేసావు నీ రక్తముతో నను కడిగివేసావు నీ వాగ్ధానముతో నన్ను స్థిరపరచావు నీ ఆత్మతో నను నింపివేసావు ||ఎంత||