నీవే నీవే కావాలి

Neevae Neevae Kaavaali

UncategorizedAdded on 3/6/2018

Lyrics

నీవే నీవే కావాలి ప్రభువుకు
నేడే నేడే చేరాలి ప్రభువును
ఈ కాలం కృప కాలం తరిగిపోతుంది
నీ మరణం లోకాంతం తరుముకొస్తుంది
నీ సృష్టికర్తను నీవు విడచినా
నీకిష్టమైన రీతి నీవు నడచినా
దోషివయినా ద్రోహివయినా
దేవుని చెంత – చేరిపుడైనా
(2)      ||ఈ కాలం||
పాపాలతో నీవు పండిపోయినా
ప్రేమించువారు లేక కృంగిపోయినా
యేసుని చరణం – పాప హరణం
యేసుని స్నేహం – పాపికి మోక్షం
(2)      ||ఈ కాలం||
నీటి బుడగలాంటిది నీ జీవితం
గడ్డి పువ్వులాంటిది నీ యవ్వనం
అధికుడవైనా అధముడవైనా
ఆయన ప్రేమ – కోరిపుడైనా
(2)      ||ఈ కాలం||

Video