నీవేయని నమ్మిక
Neevaeyani Nammika
Lyricistముంగమూరి దేవదాస్
UncategorizedAdded on 7/11/2018
Lyrics
నీవేయని నమ్మిక యేసు నాకు.. నీవేయని నమ్మిక నీవే మార్గంబు – నీవే సత్యంబు నీవే జీవంబు – నీవే సర్వంబు ||నీవే|| పెడదారిని బోవగ నా మీదికి.. ఇడుమలెన్నియో రాగ అడవిలో బడి నేను – ఆడలుచు నుండగ తడవకుండ దొరుకు – ధన్యమౌ మార్గంబు ||నీవే|| కారు మేఘము పట్టగ నా మనస్సులో.. కటిక చీకటి పుట్టగ ఘోరాపదలు చేరి – దారియని భ్రమపడగ తేరి చూడగల్గు – తేజోమయ మార్గంబు ||నీవే|| లేనిపోని మార్గంబు లెన్నోయుండ.. జ్ఞానోపదేశంబు మానుగ జేయుచు – వానిని ఖండించి నేనే మార్గంబన్న – నిజమైన మార్గంబు ||నీవే|| నరలోకమునుండి పరలోకంబు.. వరకు నిచ్చెనగా నుండి నరులకు ముందుగా – నడుచుచు ముక్తికి సరిగా కొనిపోవు సు-స్థిరమైన మార్గంబు ||నీవే||