నీవు చేసిన ఉపకారములకు

Neevu Chaesina Upakaaramulaku

Lyricistకృపా రావు
UncategorizedAdded on 11/5/2013

Lyrics

నీవు చేసిన ఉపకారములకు
నేనేమి చెల్లింతును
ఏడాది దూడెలనా… వేలాది పోట్టేల్లనా
||నీవు చేసిన||
వేలాది నదులంత విస్తార తైలము
నీకిచ్చినా చాలునా
గర్భ ఫలమైన నా జేష్ట్య పుత్రుని
నీకిచ్చినా చాలునా
||ఏడాది||
మరణపాత్రుడనైయున్న నాకై
మరణించితివ సిలువలో
కరుణ చూపి నీ జీవ మార్గాన
నడిపించుమో యేసయ్యా
||ఏడాది||
విరిగి నలిగిన బలి యాగముగను
నా హృదయ మర్పింతును
రక్షణ పాత్రను చేబూని నిత్యము
నిను వెంబడించెదను
(2)       ||ఏడాది||
ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు
నీకేమి చెల్లింతును
కపట నటనాలు లేనట్టి హృదయాన్ని
అర్పించినా చాలునా
||ఏడాది||

Video