నీవు లేని రోజు
Neevu Laeni Roju
Lyricistశామ్యూల్ కర్మోజి
UncategorizedAdded on 7/17/2016
Lyrics
నీవు లేని రోజు అసలు రోజే కాదయా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా నీవే లేకపోతే నేనసలే లేనయా (2) ||నీవు లేని|| బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు నన్ను విడువనన్నవు – నా దేవుడైనావు ఈ నాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే నేను కలిగియున్నవన్ని నీదు కృపా భాగ్యమే నీవు నా సొత్తన్నావు – కృపాక్షేమమిచ్చావు