నీవు లేనిదే నేను లేను

Neevu Laenidae Naenu Laenu

UncategorizedAdded on 11/16/2018

Lyrics

జి ఎస్తేర్ రాణి
నీవు లేనిదే నేను లేను ప్రభువా
నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా
బ్రతుకలేనయ్యా నీవు లేక క్షణమైనా
నీవు లేకుంటే నా బ్రతుకే శూన్యం
మరువకయ్యా నన్ను ఏ క్షణము దేవా
నీ ప్రేమతో నన్ను లాలించు ప్రతి క్షణము
గమ్యమును ఎరుగక నేను వెతలు పాలైన వేళ
తీరాన్ని దాటలేని నావ నేనైన వేళ
నా గమ్యం నీవైతి – ఆ గమ్యం సిలువాయే
ఆ సిలువే నాకు శరణం
నా పాప పరిహారం
అపజయమే నాదు బ్రతుకును విషాదముగా మార్చిన వేళ
జీవించుటకాశ లేక మరణాన్ని కోరిన వేళ
నా ఆశ నీవైతి – ఆ ఆశ సిలువాయే
ఆ సిలువే నాకు నిరతం
నా జీవిత చిరుదీపం

Video