నీవు ప్రార్థన చేయునప్పుడు

Neevu Praarthhana Chaeyunappudu

Lyricistక్రాంతి చేపూరి
UncategorizedAdded on 1/4/2016

Lyrics

నీవు ప్రార్థన చేయునప్పుడు
అడుగుచున్న వాటిని
పొందియున్నాననే నమ్మకమున్నదా నీకు
నమ్మిక లేకయే నీవు చేసే ప్రార్థన
తండ్రి సన్నిధి చేరదని గుర్తెరుగుమా నేడు
నమ్ముట నీ వల్ల అయితే నమ్ము వానికి అన్నియు
సాధ్యమేనని చెప్పిన మాట మరచితివా
ప్రభు మాట మరచితివా
||పొందియున్నాననే||
బాధలు ఇబ్బందులు నిన్ను చుట్టిన వేళలో
విశ్వాస ప్రార్థనా బలము మరచితివా
సింహాల బోనులోన ప్రార్థించిన దానియేలు
నమ్మి పొందిన భయము లేని జయము మరచితివా
ఆ జయము మరచితివా
||పొందియున్నాననే||
గెత్సేమనే తోటలో కన్నీటి ప్రార్థన
ఆంతర్యమును గ్రహియించుమా నేడు
సొంత చిత్తము కాకయే తండ్రి చిత్తము నెరవేర్చి
ప్రభువు మనకు నొసగెను రక్షణానందం
ఈ రక్షణానందం
||పొందియున్నాననే||

Video