నీవు తడితే తలుపు తీయనా

Neevu Thadithae Thalupu Theeyanaa

Lyricistఎం మార్క్
UncategorizedAdded on 10/15/2016

Lyrics

నీవు తడితే తలుపు తీయనా ప్రభు
నాలో నీవుంటే ఇంకేల నాకు భయం
పాపముతో నిండియున్న నా బ్రతుకును
పరిశుద్ధ పరిచావు నా యేసయ్యా
పాపములో జీవించుచున్న నాపై
ప్రేమ చూపి నా తలుపు తట్టావయ్యా
నా చీకటి బ్రతుకులో వెలుగును నింపి
నన్ను నడిపించగ వచ్చావయ్యా
తెరిచాను నా తలుపులు రావా ప్రభు
ఇక నన్ను వీడి నిన్ను వెళ్లనివ్వను
నాలోన నీవుండి పోవాలి
నీతోనే నడవాలి ఇక మీదట
రక్షణనే కేడెము చేత పట్టి
ప్రతి తలుపును తట్టి నిన్ను మహిమ పరచెద
విలువలేని నన్ను నీవు ఎంచుకొంటివి
వాక్యమనే ధ్యానముతో నన్ను నింపుమా
స్వస్థతనే వరముల దయచేయుమా
కడ వరకు పరుగెడుదును నీ బాటలో
ఎల్లవేళలా నాతో ఉండి నన్ను
చేయి పట్టి నడిపించు నా యేసయ్యా

Video