నీవు తప్ప నాకీ లోకంలో

Neevu Thappa Naakee Lokmlo

UncategorizedAdded on 8/12/2017

Lyrics

మైలబత్తుల యేసు పాదం
నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా
నీకు తప్ప నాలో ఎవరికీ చోటే లేదయ్యా
దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా
నజరేతు వాడా నను విడిచిపోకయ్యా
గ్రుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా
మూగవాడినయ్యా నా స్వరమునీయవా
కుంటివాడినయ్యా నా తోడు నడువవా
(2)           ||దావీదు||
లోకమంత చూచి నను ఏడిపించినా
జాలితో నన్ను చేరదీసిన
ఒంటరినయ్యా నా తోడు నిలువవా
(2)           ||దావీదు||
నా తల్లి నన్ను మరచిపోయినా
నా తండ్రి నన్ను విడచిపోయినా
తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా
(2)           ||దావీదు||

Video