నీవు తప్ప నాకు ఇలలో
Neevu Thappa Naaku Ilalo
Lyricistఫిలిప్ ప్రకాష్
UncategorizedAdded on 12/12/2024
Lyrics
నీవు తప్ప నాకు ఇలలో ఎవరున్నారయ్యా నీ ప్రేమ కన్నా సాటి భువిపై ఏదీ లేదయ్యా నువ్వంటూ లేకుంటే నే బ్రతుకలేనయ్యా నేనిలా ఉన్నానంటే నీ దయేనయ్యా నీ ప్రేమ లేకుంటే ఈ జన్మ లేదయ్యా గుండె నిండ నిండున్నావు ఓ నా యేసయ్యా ||నీవు తప్ప|| కష్టాల చెరలో చిక్కుకున్న నన్ను నీ ప్రేమ వరమే కురిపించినావు ఈ లోకమంతా వెలివేస్తున్న నీ ప్రేమ నాపై చూపించినావు నీ అరచేతిలో నను దాచినావయ్యా నా చేయి విడువక నను నడిపినావయ్యా నా తోడై నా నీడై వెంటుంటే చాలయ్యా ||నువ్వంటూ|| కన్నీటి అలలో మునిగిన నన్ను నీ దివ్య కరమే అందించినావు ఆ సిలువలోనే నీ ప్రాణమును నను రక్షింప అర్పించినావు నీ కృప నీడలో నను కాచినావయ్యా ఒక క్షణము వీడక కాపాడినావయ్యా నా శ్వాసై నా ధ్యాసై నువ్వుంటే చాలయ్యా ||నువ్వంటూ||